చిత్తురులో నకిలీ నోట్ల ముఠా గట్టురట్టు

24 Jul, 2019 15:51 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: జిల్లాలో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు అయింది. కుప్పం మండలంలోని సామగుట్టపల్లిలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ.. ఏజెంట్ల ద్వారా దొంగనోట్ల చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసుల బుధవారం అరెస్టు చేశారు. ఈ ముఠా వద్ద సుమారు రూ. రెండు కోట్ల 70 లక్షల 22 వేలు దొంగ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు తమిళనాడులోని కృష్ణగిరికి చెందినవారు. కాగా కుప్పం మండలంలోని సామగుట్టపల్లి పల్లికి చెందిన ఇంటి యజమనితో పాటు.. తిరుపతికి చెందిన మరో ముగ్గురిగా భావించిన పోలీసుల వారిని అదుపులోకి తీసుకున్నారు.

దీంతోపాటు లక్ష రూపాయల నకిలీ కరెన్సీ చలామణి చేస్తే రూ.10వేలు కమీషన్ ఇస్తూ ఏజెంట్ల ద్వారా దొంగ నోట్ల చలామణి చేస్తున్నారని పోలీసులు తెలిపారు. పెద్దనోట్ల రద్దు సమయం నుంచి ఈ ముఠా దొంగనోట్లను చలామణి చేస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీ నోట్లలో పాత వెయ్యి రూపాయాల నోట్లతో పాటు కొత్త రూ. 2 వేలు, రూ. 500 నోట్లు లభించినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు