అప్పులబాధతో ఉల్లిరైతు ఆత్మహత్య

31 Jul, 2015 16:10 IST|Sakshi

కోస్గి (కర్నూలు) : ఒక వైపు ఉల్లి ధర ఆకాశాన్నంటుతుంటే.. మరో వైపు అదే ఉల్లిని పండించే రైతు అప్పుల బాధ తట్టుకోలేక పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోస్గి మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కోస్గి మండలానికి చెందిన తాయన్న(54) తనకున్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూన్నాడు. ఉల్లి, ఆముదం పంటలు పండిస్తున్నాడు.

ఈ క్రమంలో రెండు సంవత్సరాల నుంచి వర్షాలు లేకపోవడంతో పంటలు చేతికందక రూ. 3 లక్షల వరకు అప్పులు పెరిగాయి. దీంతో అప్పులు తీర్చే దారి కనబడక, మనస్తాపానికి గురై శుక్రవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు