తల్లి ఒడికి పసిగుడ్డు

11 Oct, 2013 04:07 IST|Sakshi

 జగిత్యాల, న్యూస్‌లైన్ :
 రెండు రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఐదు రోజుల పసిగుడ్డు తల్లి ఒడికి చేరింది. తాను గర్భిణీ అని ఆడిన నాటకం బయటపడకుండా తనకు పుట్టిన బాబే అని నమ్మించేం దుకు ఓ ఆశవర్కర్ ఆడిన నాటకం ఇంతదాకా తీసుకొచ్చింది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు రెండు రోజుల్లోనే మిస్టరీ ఛేదిం చారు. నిందితురాలిని అరెస్టు చేసి పసిబాలుడి ని తల్లి ఒడికి చేర్చారు. తమ గారాలపట్టి... కని పించకుండా పోయి తిరిగి తమ దరికి చేరడంతో ఆ కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుం డా పోయాయి. జగిత్యాల ఆస్పత్రి నుంచి పసిగుడ్డు అపహరణ కేసులో నిందితురాలు గొల్లపల్లి మండలం గంగాపూర్‌కు చెందిన ఆశ వర్క ర్ మెట్టుసునీతను అరెస్టుచేసినట్లు ఏఎస్పీ రమా రాజేశ్వరి తెలిపారు. వివరాలను గురువారం తనకార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు.
 
 ఏం జరిగింది?
 కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లికి చెందిన బొంకెన మమత ఈ నెల 4న జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు సాయంగా అత్త విజయలక్ష్మి ఉంటోంది. మంగళవారం ఉదయం బాలుడిని విజయలక్ష్మి ఎండపొడకు చూపుతుండగా గొల్లపల్లి మండలం గంగాపూర్‌కు చెందిన ఆశ వర్కర్ మెట్టు సునీత మాటలు కలిపింది. నర్సుగా పనిచేస్తున్న విజ యలక్ష్మి కూతురు తనకు తెలుసని చెప్పింది. పిల్లాడిని నిత్యం వైద్యుడికి చూపించాలని చెప్పండి. కొద్దిసేపటికి విజయలక్ష్మి బాలుడిని తీసుకుని పిల్లల వైద్యుడి వద్దకు వెళ్లగా అక్కడ చీటీ అవసరం కావడంతో తిరిగి వార్డుకు వస్తోంది. సునీత ఎదురై బాలుడిని తాను పట్టుకుంటానని, చీటీ తెచ్చుకొమ్మని చెప్పింది. సునీ తను నమ్మిన విజయలక్ష్మి ఆ పసిగుడ్డును ఆమె చేతుల్లో పెట్టి చీటీకోసం వెళ్లింది. తిరిగి వచ్చేసరికి బాబుతోపాటు సునీత మాయమైంది.
 
 పోలీ సులకు ఫిర్యాదు చేయగా సీఐ కిరణ్‌కుమార్ వివరాలు సేకరించారు. ఓ ఆశ వర్కర్ బాలుడి ని అపహరించిందని అక్కడే ఉన్న మహిళ సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. సునీత 8న ఓ పసికందుతో జగిత్యాల రావడాన్ని సుంకరి రాజనర్సయ్య గమనించి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో పోలీ సులు సునీత సెల్‌నంబర్ సేకరించి, ఆమె బంధువులతో మాట్లాడించారు. తాను ఆసిఫాబాద్ దగ్గర ఓ ఊళ్లో ఉన్నానని, బాలుడిని అపహరించలేదని చెప్పి మొబైల్ స్విచ్ఛాఫ్ చేసింది. అనంతరం మహారాష్ట్ర రాజోలిలోని చిన్నమ్మ త్రిశూల్ నీలాబాయ్ ఇంటికి వెళ్లింది. అక్కడ కష్టమని భావించి చంద్రాపూర్‌లో బాబాయ్ తోకలశ్రీనివాస్ ఇంటికెళ్లి తలదాచుకుంది. సమాచారం వెంటవెంటనే తెలుసుకుంటూ పోలీసులు, పసికందు బంధువులు సునీత తల దాచుకున్న ఇంటికి చేరుకుని బుధవారం రాత్రి ఆమెను పట్టుకున్నారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి కోర్టుకు పంపించారు. పసిగుడ్డును కుటుం బసభ్యులకు అప్పగించారు. కేసును ఛేదించిన కిరణ్‌కుమార్, ఎస్సై రామ్మూర్తి, కానిస్టేబుల్ ఎండీ.షాబీర్‌ను ఏఎస్పీ అభినందించారు.
 
 పట్టలేని ఆనందం
 బోసినవ్వుల బుజ్జాయిని తనివితీరా చూడకముందే ఓ మాయలాడి తమనుంచి దూరం చేయగా... పసిగుడ్డు దొరికాడనే సమాచారంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. గురువారం బాలుడిని తీసుకురాగానే తల్లిదండ్రులు మమత-సంతోష్, నానమ్మ విజయలక్ష్మి, తాత య్య పట్టరాని సంతోషంతో గుండెలకు హత్తుకున్నారు. తనివితీరా ముద్దాడుతూ ఆనందాన్ని పంచుకున్నారు. తమ బిడ్డ తమకు దక్కినందు కు ఎంతో సంతోషంగా ఉందని, లేకుంటే జీవి తాంతం కుమిలిపోయే పరిస్థితి వచ్చేదని తల్లి, నానమ్మ పేర్కొన్నారు. నిందితురాలికి శిక్ష పడేవరకూ వదిలేది లేదని సంతోష్ అన్నారు. బాలుడికి వైద్యపరీక్షలు నిర్వహించారు.
 
 భర్త పోరు భరించలేక...
 గంగాపూర్‌లో ఆశవర్కర్‌గా పనిచేస్తున్న సునీత కు తొలి సంతానంగా కుమారుడు(9) ఉన్నాడు. భర్త మల్లేశ్ ఉపాధి నిమిత్తం దుబయ్‌లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు వస్తుండేవాడు. వీరికి మరో సంతానం కలగకపోవడంతో సునీతపై భర్త కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆయ న ఈ ఏడాది జనవరిలో ఇంటికి వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత సునీత గర్భం దాల్చింది. రెం డు నెలల తర్వాత మల్లేశ్ మళ్లీ దుబాయ్ వెళ్లా డు. సునీతకు మూడు, నాలుగు నెలల్లో గర్భస్రావం అయింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పకుండా దాచిపెట్టింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో పథకం ప్రకారం ఆస్పత్రి నుంచి పసికందును అపహరించి... తమకు పుట్టిన బిడ్డగా చెప్పాలని భావించింది. ఇందుకు ముందే ప్రణాళిక రచించుకుంది. గర్భిణీగా జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో పేరు నమోదు చేయించుకుని వైద్యం పొందిన సునీత, గర్భస్రావం విషయం ఎవరికీ చెప్పలేదు. ఆస్పత్రి రికార్డుల్లో ఆమె గర్భిణీగానే కొనసాగుతోంది. ఈ రికార్డు సైతం ఆమె పట్టుపబడడానికి ఓ కారణమైంది. బాలుడిని అపహరించిన సమయంలో కూడా ఆమె కృత్రిమ గర్భంతోనే కనిపించడం విశేషం.
 

>
మరిన్ని వార్తలు