మారేడుపల్లిలో ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం

16 Mar, 2014 11:45 IST|Sakshi

నగరంలోని మారేడుపల్లిలో  ఓ అపార్ట్మెంట్లో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. అపార్ట్మెంట్ వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

 

షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు అపార్ట్ మెంట్ వాసులను ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు