గోదావరికి పెరుగుతున్నవరద ఉధృతి

13 Jul, 2013 17:44 IST|Sakshi

ఎగువన కరిసిన వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి మరింతగా పెరిగింది. ప్రస్తుత నీటిమట్టం 33.5 అడుగులకు చేరింది. ఖమ్మం జిల్లాలోని వాజేడు మండలంలో చీకుపల్లి, కొంగాల వాగులు పొంగిపొర్లుతున్నాయి. దాంతో దాదాపు 25 గ్రామల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పలు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

అలాగే ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. దాంతో 1.5 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. జంటనగరాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ ప్రాజెక్టులో నీరు నిండుకుండాలా ఉంది. హుస్సేన్ సాగర్లో నీటిమట్టం 514.8 అడుగులకు చేరుకుంది. హుస్సేన్సాగర్ ప్రాజెక్టులో వరదనీరు వల్ల శివారు ప్రాంతంలోని ప్రజల ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దాంతో ఆ శివారు ప్రాంత ప్రజలను అధికారులు శనివారం అప్రమత్తం చేశారు.

మరిన్ని వార్తలు