ప‌ట్టాలు త‌ప్పిన గూడ్సురైలు

13 Jul, 2017 13:12 IST|Sakshi
న‌ర‌స‌న‍్నపేట‌: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ఉర్లాం రైలు నిలయానికి సమీపంలో గురువారం  గూడ్సురైలు పట్టాలు తప్పింది. విశాఖపట్నం నుంచి పలాస వైపు వెళ్తున్న సమయంలో వేరే రైలు వెళ్ళేందుకు నాలుగో నెంబర్‌ ట్రాక్ లో నిలుపుదల చేశారు. ఇంతలో అటువైపు నుంచి వస్తున్న రైలుకు సిగ్నల్ ఇచ్చారు.

గూడ్స్ రైలు డ్రైవర్ త‌న రైలుకే అనుకొని బండి స్టార్ట్ చేశాడు. దీంతో నాలుగో నెంబరు ట్రాక్ లో ఆగి ఉన్న గూడ్స్... ట్రాక్ డెడ్ ఎండ్ వరకు వెళ్లిపోయింది. ఇక పట్టాలు లేకపోవడంతో ఆగిపోయి ఇంజిన్ గాల్లోకి తేలిపోయింది. ఈ మార్గంలో మిగిలిన రైలు రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఈ సంఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
 
మరిన్ని వార్తలు