తెరపైకి మున్సి‘పోల్స్’

5 Feb, 2014 04:56 IST|Sakshi

 ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ :  మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశంతో జిల్లాలో సందడి మొదలైంది. నాలుగు వారాల్లో నిర్వహించాలంటే సాధ్యం  కాదని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఉండగా, ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. మందమర్రి బల్దియా ప్రత్యేకపాలనలో ఉంటుందని అధికా ర వర్గాలు చెబుతున్నాయి.

ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా 2013 సర్వే ప్రకారం నిర్వహిం చడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. జిల్లా లో ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, కాగజ్‌నగర్, మంచిర్యాల,బెల్లంపల్లి మున్సిపాలిటీలు ఉన్నా యి. మున్సిపాలిటీల్లో ఎన్నికలకు వార్డులవారీ గా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఇప్పటి 2013 లో మున్సిపల్ అధికారులు పోలింగ్ బూత్‌లను గుర్తించారు. ఆదిలాబాద్‌లో 36 వార్డులకు 81, భైంసాలో 23 వార్డులకు 23, బెల్లంపల్లిలో 34 వార్డులకు 35, నిర్మల్‌లో 36 వార్డులకు 58, మంచిర్యాలకు 32 వార్డులకు 62 పోలింగ్ కేం ద్రాలు ఏర్పాటు చేశారు. వార్డులవారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్‌లు ఖరారు చే శారు. కలెక్టర్ ఆమోదం తీసుకుని సిద్ధంగా ఉన్నాయి.

 నాలుగు వారాల్లో సాధ్యపడేనా?
 నాలుగు వారాల్లో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలనే హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా అధికారుల్లో గుబులు నెలకొంది. 2014 ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా రిజర్వేషన్లు మారితే నాలుగు వారాల్లో ఎన్నికలు నిర్వహించడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో ఇన్నాళ్లు మున్సిపాలిటీలు కొనసాగాయి. గత 2010 సెప్టెంబర్ 31వ తేదీన మున్సిపల్ కౌన్సిల్ గడువు ముగిసింది.

 దీంతో మూడున్నర ఏళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో సాగింది. ప్రత్యేకంగా 2011లో జరగాల్సిన ఎన్నికలు జరగక పోగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో వచ్చిన ఆందోళనతో ఈ ఎన్నికలు నిర్వహణకు నోచుకోలేదు. ప్రస్తుతం హైకోర్టు నిర్ణయంతో ఆశావహులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు