అంతర్జాతీయ ‘ఎర్ర’ స్మగ్లర్ అజయ్ అరెస్ట్

7 Apr, 2016 02:05 IST|Sakshi

చిత్తూరు (అర్బన్) : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కేరళకు చెందిన అజయ్ (47)ను అరెస్ట్ చేసినట్టు ఓ ఎస్డీ రత్న తెలి పారు. ఆమె బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.


శేషాచలం టూ దుబాయ్, హాంకాంగ్..
కేరళ రాష్ట్రం కాలికట్ జిల్లాలోని ఎడచే రి గ్రామానికి చెందిన అజయ్ పదో త రగతి ఫెయిల్ అయ్యాడు. 2004 వర కు ఇతను కేరళలోని పాలకాడ్‌లో ఉన్న శ్రీగంధం బొమ్మల తయారీ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేశాడు. అక్కడ పనిచేసే మహిళల ద్వారా శ్రీగంధాన్ని తెప్పించి ఇతరులకు విక్రయిస్తూ కొంతమంది అనుచరులను తయారు చేసుకున్నా డు. అతను శేషాచలంలో కూలీలు, మే స్త్రీల ద్వారా ఎర్రచందనం దుంగల్ని తె ప్పించి చెన్నై, ముంబయి ద్వారా విదేశాలకు తరలించేవాడు. దుబాయ్‌లో ఉంటున్న సాహుల్‌భాయ్, హాంకాంగ్‌లోని సలీమ్‌కు కూడా ఎర్రచందనం ఎగుమతి చేశాడు. గత ఏడాది అరెస్టయిన చైనా స్మగ్లర్ ఛెయన్ ఫియాన్‌కు కూడా అజయ్ ఎర్రచందనం అందచేశాడు. ఇలా ఇప్పటి వరకు 200 టన్ను ల ఎర్రచందనాన్ని ఎగుమతి చేసిన అ జయ్ రూ.40 కోట్ల వరకు కూడ పెట్టాడు. గత ఏడాది చిత్తూరు పోలీసులు కేరళలో తనిఖీలు నిర్వహించి అతని అనుచరులు నాజర్, ఉమర్, లతీష్‌ను అరెస్టు చేశారు. ఏడాదిగా అజయ్‌పై నిఘా పెట్టారు.
 

 
అజయ్‌పై 13 కేసులు..

అజయ్‌పై జిల్లాలోని తాలూకా, గుడిపాల, సదుం, మదనపల్లె, భాకరాపే ట, వెదురుకుప్పం, పుత్తూరు, నగరి, ఎస్‌ఆర్.పురం, కల్లూరు, విజయపురం పోలీసు స్టేషన్లలో 13 కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా శ్రీగంధం స్మ గ్లింగ్ చేస్తూ కేరళ పోలీసులకు నాలుసా ర్లు చిక్కాడు. ఇతన్ని విచారించాల్సి ఉందని, ఇతనిచ్చే సమాచారంతో ప లువురుని అరెస్టు చేస్తామని ఓఎస్డీ పే ర్కొన్నారు. గుడిపాల ఎస్‌ఐ లక్ష్మీకాం త్, చి త్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు, సీఐలు ఆదినారాయణ, చంద్రశేఖర్‌ను ఓఎస్డీ అభినందించారు.

మరిన్ని వార్తలు