రైతులకు అందని ఐటీడీఏ విత్తన రాయితీ

14 Jun, 2014 02:50 IST|Sakshi
రైతులకు అందని ఐటీడీఏ విత్తన రాయితీ

సీతంపేట: గిరిజన రైతులకు విత్తనాల రాయి కల్పనలో ఏటా ఐటీడీఏ మొండిచెయే చూపుతోంది. విత్తన రారుుతీ అందుతుందని ఆశిం చిన రైతులకు ఈ ఏడాది నిరాశే మిగిలింది. విత్తనాల పంపిణీ మొదలైనా రారుుతీ ప్రకటించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఐటీడీఏ వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగడంలేదని గిరిజనులు వాపోతున్నారు. రెండేళ్ల కిందట బస్తాకు వ్యవసాయ శాఖ రూ.150, ఐటీడీఏ మరో రూ.150 సబ్సిడీ ఇచ్చేది. దీంతో బస్తాకు రూ.300 వరకు రైతుకు భారం తగ్గేది. రైతులు కూడా కొంత పెట్టుబడి పెట్టి నచ్చిన విత్తనాలు కొనుగోలు చేసేవారు. అయితే, రెండేళ్లుగా ఐటీడీఏ రాయితీ ఇవ్వకపోవడంతో విత్తన కొనుగోళ్లు గిరిజనులకు భారంగా మారింది. సీతంపేట మండలానికి ప్రస్తుతం 1001 రకం 852 బస్తాలు వచ్చాయి.

వీటి ధర రూ.750 కాగా వ్యవసాయ శాఖ కిలోకు రూ.5 మాత్రమే సబ్సిడీ ఇస్తోంది. అంటే బస్తాకు రూ.150 సబ్సిడీ ఇవ్వగా రైతు రూ.600 చెల్లించాలి. అదే ఐటీడీఏ సబ్సిడీ ఇస్తే రూ.450కే బస్తా విత్తనాలు వచ్చేవి. అలాగే 1010 రకం 89 బస్తాలు వచ్చాయి. వీటి ధర సబ్సిడీ పోను రూ.588. ఐటీడీఏ సబ్సిడీ ఇచ్చి ఉంటే మరో రూ.150 తగ్గేది. శ్రీకాకుళం సన్నాలు 11 బస్తాలు మాత్రమే వచ్చాయి. వీటి ధర సబ్సిడీ పోనూ రూ.645కు ైరె తుకు లభిస్త్తుంది. ఐటీడీఏ సబ్సిడీ ఉంటే రూ.150 తగ్గేది. నెల్లూరు సన్నాలపై 25 కిలోల బస్తాలపై వ్యవసాయ శాఖ రూ.250 సబ్సిడీ ఇస్తుంది. ఐటీడీఏ సబ్సిడీ ఇస్తే మరో రూ.250 తగ్గి ఉండేది.
 
రెండు రాయితీలు ఇవ్వలేం...
 వ్యవసాయశాఖ, ఐటీడీఏలు కలిపి రాయితీలు ఇవ్వలేవని వ్యవసాయూధికారి జ్ఞానేంద్రమణి అన్నారు. గతంలో ఐటీడీఏ సబ్సిడీ ఇచ్చేదని, గతేడాది నుంచి సబ్సిడీని ఎత్తేసిందన్నారు. దీంతో రైతులు వ్యవసాయశాఖ ఇస్తున్న సబ్సిడీని మాత్రమే వినియోగించుకోవాలని తెలిపారు.

మరిన్ని వార్తలు