కళారంగానికి కళాకౌముది విశిష్టసేవలు

22 Mar, 2015 03:23 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి
 
రాజంపేట : రాజంపేట పట్టణంలో కళారంగానికి కళాకౌముది సేవా సంస్థ విశిష్ట సేవలందించిదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాధరెడ్డి గుర్తు చేశారు. శనివారం రాత్రి స్థానిక కాకతీయ విద్యాసంస్థ కళావేదికలో కళా కౌముది సంస్థ అధ్యక్షుడు పోలా వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో సంస్థ 24వ వార్షికోత్సవం సభకు ఆకేపాటి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 1992లో కళా కౌముది సంస్థ  వివిధ రకాలుగా కళ,సాహిత్య రంగాలను పెంచి పోషించే విధంగా ముందుకు నడిచిందన్నారు. కళాకౌముది సంస్థ అంటే గుర్తుకొచ్చేది దివంగత టీటీడీ బోర్డు  మాజీ చైర్మన్ ఆకేపాటి చెంగల్‌రెడి అని పేర్కొన్నారు.

కళాకౌముది సంస్థను చెంగలరెడ్డి స్థాపించారని, నేటికీ ఆ సంస్థ తన మనుగుడ విషయంలో రాజీ పడకుండా ముందుకువెళుతోందని పేర్కొన్నారు. తాను ఈ సంస్థ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. సంస్థ గౌరవ అధ్యక్షుడు రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆకేపాటి రజనీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ కళాకౌముది సంస్థ సభ్యుల సహకారంతో 24యేళ్లపాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వీడన్ ప్రొఫెసర్ ఆకేపాటి వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ కళాకౌముది సంస్థను దిగ్విజయంగా నిర్వహించడంలో సమష్టి కృషి దాగి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారుడు, కాకతీయవిద్యాసంస్థల అధినేత పోలా శ్రీనివాసులరెడ్డి , పీ.రాధాకృష్ణారెడ్డి,  ప్రముఖ వైద్యుడు సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షుడు మలిశెట్టి సుబ్బరాయుడు, కార్యదర్శి ఎన్.శివరాజు, పర్యవేక్షకుడు దరూరి హరినాధ్‌చౌదరి, పట్టణానికి చెందిన కెఎంఎల్ నరసింహులు, పాపినేని విశ్వనాధరెడ్డి, డీలరు సుబ్బరామిరెడ్డి, రాఘవరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, తెలుగుభాష సంరక్షణసమితి ప్రతినిధులు కాకర్లరాముడు, గంగనపల్లె వెంకటరమణ, విద్యాన్ చిన్నయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం యుపీ రాయుడు కళాబృందంచే అద్భుత ఇంద్రజాల ప్రదర్శన, హాస్యవల్లరి వేణుగోపాల్ చే నిర్వహించి కార్యక్రమం సభికులను అలరించింది. శ్రీచక్ర యూపీ స్కూలు, సరస్వతీ విద్యామందిర్, చక్రశుభ నివాస్ స్కూల్ విద్యార్థుల నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు