ముగిసిన నీటి పారుదల సలహా మండలి సమావేశం

11 Jul, 2019 20:53 IST|Sakshi

సాక్షి, విజయవాడ : జలవనరుల శాఖ ఆధ్వర్యంలో గురువారం కృష్టాజిల్లా 31వ నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పార్థసారధి, మల్లాది విష్ణు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. రేపు(శుక్రవారం) ఉదయం 9.45 గంటలకు ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. పంట దెబ్బతినకుండా ప్రతి రైతుకు నీరు అందిస్తామన్నారు.

కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులను కొనసాగిస్తామని కొడాలి నాని పేర్కొన్నారు. సాగు, తాగు నీటి అవసరాల కోసం ప్రస్తుతం 70 శాతం నీరు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అవసరమైతే కాలువలను పర్యవేక్షణ చేయాలని నాని కోరారు.

మరిన్ని వార్తలు