కోడెలకు హైకోర్టులో ఊరట

21 Jun, 2017 19:08 IST|Sakshi
కోడెలకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌ ‌: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావుపై కరీంనగర్‌లో నమోదైన కేసులో హైకోర్టులో ఉపశమనం లభించింది. గతంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కరీంనగర్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ కోర్టు 2017 మార్చి8న సమన్లు జారీ చేసింది.  2014 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు రూ.11.5 కోట్లు ఖర్చయిందని ఓ ప్రవేట్‌ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో కోడెల పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయేందుకు ఆయన ఏకంగా రూ.11.5 కోట్లు ఖర్చు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కరీంనగర్‌లోని వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యులు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి  2016 జూలై 11న కరీంనగర్‌ స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఆయనకు హైకోర్టులో ఉపశమనం లభించింది. కోర్టు వాయిదా నేపద్యంలో కోడెల హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కరీంనగర్ కోర్టుకు హాజరుకాకుండా ఉండేందుకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోడెల కేసును కరీంనగర్‌ కోర్టు ఆగష్టు 22కు వాయిదా వేసింది.

చదవండి: కోడెలకు కోర్టు సమన్లు

మరిన్ని వార్తలు