ఖాకీ దిగ్బంధంలో కోనసీమ!

15 Nov, 2016 01:21 IST|Sakshi

పోలీసుల చక్రబంధంలో కాపు నేతలు
 
 సాక్షి, అమరావతి: ఆకుపచ్చని కోనసీమలో ఖాకీలు కదం తొక్కుతున్నారు. ప్రతి గ్రామం పోలీసు బూట్ల చప్పుళ్లతో మార్మోగుతోంది. వాటర్ క్యానన్ల వాహనాలు రరుురరుుమని రావులపాలెం వస్తున్నారుు. జాతీయ రహదారిపై స్పెషల్ ర్యాపిడ్ ఫోర్స్ నిఘా పెరిగింది. ఇళ్ల వద్ద బడి పిల్లల్ని దించినట్టుగా ప్రతి పోలీసు స్టేషన్ వద్ద వందలాది మంది పోలీసుల్ని దింపుతూ వాహనాలు పరుగులిడుతున్నారుు. పెద్ద నోట్ల రద్దు ఇక్కట్లు కొలిక్కి రాకముందే మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర కలకలం ప్రారంభమైంది.

నిర్ణరుుంచిన కార్యక్రమం ప్రకారం బుధవారం ఉదయం  ముద్రగడ పద్మనాభం కోనసీమకు ముఖద్వారమైన రావులపాలెం కళా వెంకట్రావ్ సెంటర్ నుంచి పాదయాత్రను ప్రారంభించాల్సి ఉంది. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని డీజీపీ సాంబశివరావు ప్రకటించడం, అయినా పాదయాత్ర జరుగుతుందని ముద్రగడ  ప్రకటించిన నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ భారీ ఎత్తున పోలీసుల్ని మోహరించింది. హర్యానా నుంచి సీఆర్‌పీఎఫ్‌ను, తెలంగాణ సహా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి పోలీసు బలగాలను కోనసీమకు రప్పించారు.

మరిన్ని వార్తలు