'కాంగ్రెస్ హైకమాండ్ను ధిక్కరిస్తే వేటు తప్పదు'

28 Jan, 2014 16:51 IST|Sakshi
'కాంగ్రెస్ హైకమాండ్ను ధిక్కరిస్తే వేటు తప్పదు'

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చురాజేస్తున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ను ధిక్కరిస్తూ రెబెల్స్ ఎన్నికల బరిలో దిగుతుండగా, వారికి కొందరు ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తున్న ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకుంటుందని మంత్రి కొండ్రు మురళి చెప్పారు.

రాజ్యసభ ఎన్నికలు, తిరుగుబాటు దారులపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారిస్తోందని తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడే నాయకులపై వేటుతప్పదని మురళి హెచ్చరించారు. కాంగ్రెస్ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా టీ సుబ్బిరామి రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా చైతన్య రాజు, ఆదాల ప్రభాకర రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. మరో నేత జేసీ దివాకర్ రెడ్డి కూడా ఎన్నికల బరిలో నిలిచే అవకాశముంది.

మరిన్ని వార్తలు