‘ధరలు పెంచితే లైసెన్సు లు రద్దు చేస్తాం’

27 Mar, 2020 12:28 IST|Sakshi

సాక్షి, అమ‌రావ‌తి : రాష్ట్రంలో  లాక్ డౌన్ అమలులో ఉన్న‌ నేపథ్యంలో ప్రజలెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్య‌వ‌సాయం, మార్కెటింగ్ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు పేర్కొన్నారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలో ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిత్య‌వ‌స‌రాలు, కూర‌గాయ‌లు అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు.
 

కరోనా: భయానికి గురిచేస్తే కఠిన చర్యలు

రాబోయే రోజులకు సరిపడే కూరగాయలు రాష్ట్రంలో నే పండుతున్నాయ‌ని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచుకోవాల్సిన పరిస్థితి లేదని, రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో రైతు బజార్ల‌ను వికేంద్రీకరించామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం రైతు బజార్లలో ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నార‌న్నారు. ప్రజలు ఇంట్లో నుంచి రాకుండా కూరగాయలు అందించేలా మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ధరలు పెంచితే వ్యాపారుల లైసెన్సు లు రద్దు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ప్రతి రోజు జిల్లాల్లో జేసీలు ధరలను ప్రకటిస్తార‌ని, వాటికి మించి విక్రయిస్తే చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. 

మరిన్ని వార్తలు