ఐఏఎస్, ఐపీఎస్‌ల పంపిణీపై కమిటీ

7 Mar, 2014 02:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్:  అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసే సలహా కమిటీకి సూచనలు అందజేసేందుకోసం సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.శామ్యూల్ అధ్యక్షతన ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

రెండు రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ ఎలా ఉండాలనే అంశంపై ఈ కమిటీ తగిన సూచనలు, సలహాలను రూపొందించి రెండు వారాల్లోగా కేంద్రం నియమించే కమిటీకి అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) మహంతి గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కమిటీలో ఎల్.వి.సుబ్రహ్మణ్యం, అజయ్ మిశ్రా, వి.నాగిరెడ్డి, ఐపీఎస్ అధికారులైన వి.ఎస్.కె.కౌముది, ఎం.శివప్రసాద్, ఐఎఫ్‌ఎస్ అధికారులైన రమేశ్, పి.వి.రమణారెడ్డి సభ్యులుగా ఉంటారు. కమిటీకి కన్వీనర్‌గా లవ్ అగర్వాల్ వ్యవహరిస్తారు.

మరిన్ని వార్తలు