మావోల చేతిలో యువకుని హతం

1 Sep, 2015 00:21 IST|Sakshi
మావోల చేతిలో యువకుని హతం

గొడ్డలితో నరికిచంపిన మావోయిస్టులు
పోలీసులకు సహకరిస్తున్నాడని చంపామంటూ ప్రకటన
కన్నీరుమున్నీరయిన తల్లిదండ్రులు

 
ముంచంగిపుట్టు: పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడనే నెపంతో విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపుట్ మండలంలోని బూసిపుట్టుకు చెందిన పాంగి రామయ్య (19)ను మావోయిస్టులు హతమార్చారు. ఆదివారం రాత్రి సాయుధులైన మావోయిస్టులు గ్రామం నుంచి రామయ్యను సమీపంలోని ప్రధాన రహదారి వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ అతడ్ని గొడ్డలితో నరికి చంపారు. సంఘటన స్ధలంలో  సీపీఐ మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ పేరిట ఓ లేఖను విడిచిపెట్టారు. రెండు సంవత్సరాలుగా రామయ్య ముంచంగిపుట్టు ఎస్‌ఐ, పోలీసులతో సంబంధాలు పెట్టుకొని బూసిపుట్టు ఏరియాలో అరెస్టులకు దాడులకు కారకుడయ్యడని ఆ లేఖలో పేర్కొన్నారు.

పలుమార్లు ప్రజలు, పార్టీ హెచ్చరించిచా మార్పు రానందునే చంపాల్సి వచ్చిందని వివరించారు. ‘రాత్రి మావోలు ఇంటికి వచ్చారు.. మా బిడ్డగురించి అడిగారు. లేడని చెప్పాం. అయినప్పటికీ వీడకుండా పక్క వీధిలో పడుకుని ఉన్న రామయ్యను బలవంతంగా తీసుకువెళ్లి చంపారని’ మృతుడి తల్లిదండ్రులు పాంగి.జోగి, ముత్తాయిలు కన్నీరు మున్నీరుగా విలపించారు.  ఈసంఘటన మండలంలో సంచలనమైంది.  
 
 

మరిన్ని వార్తలు