మాజీ సీఎంపై దాడి కేసులో మావోయిస్టుకు రిమాండ్

14 Sep, 2014 16:41 IST|Sakshi

నెల్లూరు: మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్రెడ్డి కాన్వాయిపై దాడి కేసులో మావోయిస్టు నేత దీపక్ అలియాస్ వెంకటేశ్వరరావుకు మేజిస్ట్రేట్ ఆదివారం రిమాండ్ విధించారు. దీంతో దీపక్ను నెల్లూరు పోలీసులు స్థానిక సెంట్రల్ జైలుకు తరలించారు. ఓ కేసులో నిందితుడిగా కోల్కత్తా జైల్లో ఉన్న దీపక్ను పీటీ వారెంట్పై పోలీసులు నెల్లూరు తీసుకువచ్చారు. జిల్లాలోని కోట మేజిస్ట్రేట్ ముందు దీపక్ను ఈ రోజు పోలీసులు హాజరుపరిచారు. దీంతో అతడికి రిమాండ్ విధించారు.

2007 సెప్టెంబర్ మాసంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ అందజేసే డాక్టరేట్ అందుకునేందుకు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, ఆయన భార్య అప్పటి మంత్రి ఎన్.రాజ్యలక్ష్మి తమ కాన్వాయిలో వెళ్తున్నారు. ఆ సమయంలో వాకాడు సమీపంలో ఆయన క్వాన్వాయిని మావోయిస్టులు పేల్చివేశారు. ఆ పేలుడులో కారు డ్రైవర్తోపాటు మరో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు