తీరంలో కోత నివారణకు చర్యలు

17 Dec, 2015 15:57 IST|Sakshi

విశాఖ తీరం కోతకు గురి కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు విశాఖ పోర్టు చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. గురువారం ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభిప్రాయాన్ని అనుసరిస్తూ కోతను అరికట్టేందుకు బీచ్ నరిష్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. దీనిపై నెదర్లాండ్స్‌లోని డెల్టాఫోర్స్ విశ్వవిద్యాలయం సహకారం కూడా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తీరంలో శాశ్వత కట్టడాల నిర్మాణంతో నష్టమే తప్ప లాభం లేదని వారు సూచన ఇచ్చినట్లు తెలిపారు.

 అందుకే తీరంలో రూ.13 కోట్లతో ఇప్పటి వరకు లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకనునరిష్‌మెంట్ కోసం వినియోగించినట్లు వెల్లడించారు. కురుసువ జలాంతర్గామి ప్రాంతంలో ఈ మేరకు ఇసుకను నేరుగా నింపినట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి నేరుగా కాకుండా గొట్టాల ద్వారా 1.50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీరంలో డంప్ చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే ఇండియన్ ఫ్లీట్ రివ్యూ కోసం రూ.45 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చైర్మన్ కృష్ణబాబు తెలిపారు.

మరిన్ని వార్తలు