'నో డౌట్.. నెక్ట్స్ మెగాస్టార్ అతనే' | Sakshi
Sakshi News home page

'నో డౌట్.. నెక్ట్స్ మెగాస్టార్ అతనే'

Published Thu, Dec 17 2015 4:02 PM

'నో డౌట్.. నెక్ట్స్ మెగాస్టార్ అతనే'

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'లోఫర్' సినిమాపై రామ్ గోపాల్ వర్మ తనదైన రివ్యూ ఇచ్చారు. లోఫర్ సినిమా చూశానని..  మ్యూజిక్, డ్రామా, యాక్షన్లు సరైన పాళ్లలో ఉన్న పక్కా కమర్షియల్ మాస్ మసాలా సెంటిమెంటల్ ఎంటర్టెయినర్ మూవీ అంటూ ట్వీట్ చేశారు. వరుణ్ మొదటి సినిమా 'ముకుంద', తరువాత సినిమా 'కంచె'.. ప్రత్యేకించి ఇప్పుడు 'లోఫర్' లో వరుణ్ నటనలోని వైవిధ్యం చూస్తుంటే.. నెక్ట్స్ మెగాస్టార్ వరుణే అని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదంటూ ట్వీట్ చేశారు.

రేవతి, పోసానిల నటన టెర్రిఫిక్ అని, సునీల్ కశ్యప్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని అన్నారు. ఇక హీరోయిన్ దిశా పాట్నిని  అయితే అమాంతం ఆకాశానికి ఎత్తేశారు. చాలా ఏళ్ల తర్వాత బెస్ట్ హీరోయిన్ను చూశానని, పాత్ర పరిమితి వల్ల తన ప్రతిభను పూర్తిస్థాయిలో చూడలేకపోయామన్నారు. పూరీ..  వరుణ్ తేజ్కు ఎలాంటి క్యారెక్టర్ డిజైన్ చేశాడంటే.. ఈ సినిమాతో వరుణ్ 'మెగా స్టార్డమ్'తో దూసుకుపోతాడని, ఇక మిగతా మెగా పోటీదారులకు ఆ స్టార్డమ్ మరింత దూరం అవుతుందని అభిప్రాయపడ్డారు రామ్ గోపాల్ వర్మ.

 

Advertisement
Advertisement