ఇసుక రీచ్‌ను తనిఖీ చేసిన మంత్రి

25 Nov, 2019 18:14 IST|Sakshi

సాక్షి, విజయవాడ: గ్రామీణ అభివృద్ది, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  రొయ్యూరు ఇసుక రీచ్‌ను సోమవారం తనిఖీ చేశారు. ఈ క్రమంలో మంత్రి రీచ్‌ ఇసుక తవ్వకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రోజుకు ఎంత ఇసుకను వెలికితీస్తున్నారు, ఏ మేరకు వినియోగదారులకు ఇసుకను అందిస్తున్నారు అని మైనింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిమాండ్‌ను బట్టి రీచ్‌లో అదనంగా మిషన్లను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసిన వారికి రవాణా చేస్తున్న లారీ యాజమానులతో మంత్రి ముచ్చటించారు. కాగా ఇసుక తరలింపులో ఎటువంటి జాప్యం లేకుండా జాగ్రత్త తీసుకోవాలంటూ అధికారులను హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకున్న వారికి సీరియల్‌ నంబరు కేటాయించి త్వరితగతిన ఇసుక బయటకు వెళ్లేలా చూడాలని అన్నారు. పారదర్శకంగా ఇసుక విక్రయాలు, తరలింపులు జరగాలని, అలాగే వేయింగ్‌, ఇసుక ధరల్లో ఎటువంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

మరిన్ని వార్తలు