రుయా ఆస్పత్రి అవినీతి, అక్రమాలపై భూమన ఫైర్‌

9 Sep, 2019 13:11 IST|Sakshi

సాక్షి, తిరుపతి: రుయా ఆస్పత్రిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై  తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి మండి పడ్డారు. సోమవారం రుయా ఆస్పత్రిని సందర్శించిన భూమన కోడెల తనయుడి బినామీలు అక్రమాలకు పాల్పడుతుంటే.. మీరు ఎందుకు సహకరిస్తున్నారని ఆస్పత్రి సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల కుటుంబీకుల అక్రమాల్లో మీకు కూడా వాటాలున్నాయా అని ప్రశ్నించారు. నెల నెలా కోడెల కుటుంబీకుల బినామీలు రూ. 40 లక్షలు దోచుకుంటుంటే.. మీరేందుకు మౌనంగా ఉన్నారని ఆస్పత్రి యాజమాన్యం మీద మండి పడ్డారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా మీ తీరు మారదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ చెప్పిన తర్వాత కూడా కోడెల కుమారుడి బినామీ ల్యాబ్‌ను ఎందుకు మూయించలేదని అధికారులను ప్రశ్నించారు. మీ చర్యల వల్ల మాకు కూడా వాటాలు అందుతున్నట్లు జనాల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తున్నాయని పేర్కొన్నారు. సాయంత్రం లోగా అక్రమ ల్యాబ్‌ను మూసివేయాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు