సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి

9 Nov, 2023 04:17 IST|Sakshi

చంద్రబాబు పాలనతో పోలిస్తే అన్ని రంగాల్లో ముందుకు 

4.93 లక్షల మందికి సీఎం జగన్‌ ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు

చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలు 34 వేలే

పారిశ్రామిక ప్రగతిలో 22వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎదిగింది

చంద్రబాబు తీసుకున్న రుణాలకంటే ఇప్పుడు తీసుకుంటున్నవి తక్కువే

మాజీ మంత్రి కురసాల కన్నబాబు

కాకినాడ రూరల్‌: సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధిస్తోందని, సామా­జిక న్యాయంలో ఆయన దేశంలోనే ఆదర్శంగా నిలిచారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. కన్నబాబు బుధవారం ఇక్కడ మీడి­యా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో తలసరి ఆదా­యం పెరిగిందని చెప్పారు. చంద్రబాబు పాలనతో పోలిస్తే అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు వెళ్తోందని తెలిపారు. బాబు హయాంలో తలసరి ఆదాయంలో రాష్ట్రం 17వ స్థానంలో ఉండేదని, సీఎం జగన్‌ పాలనలో తొమ్మిదో స్థానానికి వచ్చిందని తెలిపారు.

జాబు గ్యారెంటీ అని చెప్పుకుని పదవిలోకి వచ్చిన చంద్రబాబు 34,108 ఉద్యోగాలే ఇచ్చారని, జగనన్న వచ్చాక 4.93 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. వ్యవసాయ రంగంలో 27వ స్థానం నుంచి నంబర్‌ వన్‌ స్థానానికి రాష్ట్రం చేరుకుందన్నారు. బాబు హయాంలో పరిశ్రమల వృద్ధి రేటులో రాష్ట్రం 22వ స్థానంలో ఉండగా ఎల్లో మీడియా మాత్రం రెండో స్థానమన్నట్టు బిల్డప్‌ ఇచ్చేదని తెలిపారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత పరిశ్రమల స్థాపన, వృద్ధి రేటులో రాష్ట్రం మూడో స్థానానికి ఎదిగిందని తెలిపారు. ఎక్కడ 22, ఎక్కడ 3వ స్థానమని ప్రశ్నించారు.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) వైఎ­స్సా­ర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 2.5 లక్ష­లకు పెరిగాయని, అంతకుముందు 37,936 మాత్రమే ఉండేవని అన్నారు. బాబు హయాంలో తీసుకున్న రుణాలకన్నా ఇప్పుడు తీసు­కున్నవి తక్కువేనని చెప్పారు. అప్పుడు తీసుకు­న్న రుణాలు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. ఇప్పుడు తీసుకున్న రుణాలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్‌లో వేస్తున్న సంగతి అందరికీ తెలుసునన్నారు. సంక్షేమ పథకాలతో శ్రీలంకను చేస్తారా అన్న చంద్రబాబు.. ఇప్పుడు ఆయన అధికారంలోకి వస్తే గ్యారెంటీ, షూరిటీ అంటున్నారని, ఆయనకే గ్యారెంటీ, షూరిటీ లేదని వ్యాఖ్యానించారు.

ఎవరికెంత మేలు చేశామో వివరిస్తాం
ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం గురువారం ప్రారంభమవుతుంద­న్నా­రు. సచివాలయాల స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో ఎవరెవరికి ఎంత మేలు చేశా­మో వివరిస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా­లో ఫిషర్‌మెన్‌ మహిళకు, మాల వర్గానికి, బీసీ­లో శెట్టిబలిజ వర్గానికి, ఎస్సీలో మాదిగ సా­మా­జిక వర్గానికి సీఎం జగన్‌ ఎమ్మెల్సీలుగా అవ­కా­శం ఇచ్చారని, బీసీకి రాజ్యసభ స్థానం ఇచ్చా­ర­ని చెప్పారు. అందుకనే సామాజిక సాధికార బస్సు యాత్ర జిల్లాలో విజయవంతమైందన్నారు.

మరిన్ని వార్తలు