టీడీపీ నాయకుల వ్యాఖ్యలు హాస్యాస్పదం

10 Sep, 2019 08:31 IST|Sakshi
సమస్యలపై ఆరా తీస్తున్న ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి

సాక్షి, విజయనగరం : తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞానవంతులో, అవివేకులో తెలియని పరిస్థితి నెలకొందని స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. సోమవారం విజయనగరంలోని 38వ వార్డు కొత్త అగ్రహారం, బూర్లపేట, గవర వీధి, గాజుల వీధి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంద రోజుల పాలనలో ఏం జరిగిందంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తుంటే నవ్వొస్తోందన్నారు. ఐదేళ్లు పరిపాలించాలని టీడీపీకి అవకాశం ఇస్తే అవినీతి, చేతకాని పరిపాలన చూసి ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు.  

సమస్యలు వింటూ పరిష్కారం చూపుతూ..
వార్డు పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి స్థానిక సమస్యలను వింటూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా కొత్త అగ్రహారంలో ఉన్న మున్సిపల్‌ క్వార్టర్స్‌ శిథిలావస్థకు చేరి పందులకు ఆవాసంగా మారడంతో కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. బూర్లుపేటలో విద్యుత్‌ లైట్లు లేకపోవడం అంధకారం అలుముకుంటుందని,  ఐరన్‌ స్తంభాలు షాక్‌ కొడుతున్నాయని ఆ ప్రాంత మహిళలు ఎమ్మెల్యే కోలగట్ల కు చెప్పగా, ఐరన్‌ పోల్స్‌ ప్రాంతంలో సిమెంటు స్తంభాలు వేయాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు.

పాడైన రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు వేయాలని, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే కోలగట్లకు డాక్టర్‌ రమణమూర్తి, ఉడతా కాశీ, పసుమర్తి గణేష్, పువ్వాడ వర్ధన్, బొడ్డు కష్ణ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే కోలగట్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ వార్డు జోనల్‌ ఇంచార్జి కేదారిశెట్టి సీతారామమూర్తి(రాంపండు), వార్డు పార్టీ అధ్యక్షుడు పిల్లా వేణు, పిల్లా పాండురంగారావు, ఆడారి శ్రీను, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేటి నుంచి కొత్తమెనూ

నాణెం మింగిన విద్యార్థిని

టీడీపీ నాయకుల కుట్రలను తిప్పికొడతాం

వీడని ముంపు

బిగుసుకుంటున్న ఉచ్చు 

ఆస్తులు రాయించుకుని ఇంట్లోంచి గెంటేశారు

రూ. 10 వేల సాయంపై విధి విధానాలు జారీ

ఎందుకిలా చేశావమ్మా?

నేటి నుంచి రొట్టెల పండుగ

అక్రమ రిజిస్ట్రేషన్లలో బెజవాడ టాప్‌

ఉధృతంగా గోదావరి

విశాఖ భూ స్కాంపై పునర్విచారణ

సీఎం ఇచ్చిన స్వేచ్ఛతోనే.. పారదర్శకంగా పరీక్షలు

ప్రశాంతతకు భంగం కలిగించేందుకే ‘పెయిడ్‌’ డ్రామాలు

అందరికీ అందాలి: సీఎం జగన్‌

‘ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు’

ఏపీ లోకాయుక్తగా జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి నియామకం

ఈనాటి ముఖ్యాంశాలు

‘అలా అనుకుంటే ఆశాభంగం తప్పదు’

గురువాచారిని దారుణంగా హింసించారు: సుచరిత

పనులు ఆగలేదు..అవినీతి ఆగింది..

సీఎం జగన్‌ ఇచ్చిన స్వేచ్ఛతోనే అది సాధ్యమైంది

జల దిగ్బంధంలో లంక గ్రామాలు

రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అనిల్‌కుమార్‌

మహిళా శిశుసంక్షేమ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

విశాఖ అభివృద్ధిపై కలెక్టర్‌ నివేదిక

చంద్రబాబు ఓర్వలేక పోతున్నారు..

పాము కలకలం .. మంత్రికి తప్పిన ప్రమాదం

కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా ధర్నా

‘కోడెల అక్రమాల్లో మీకు కూడా వాటాలున్నాయా’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పారితోషికం తగ్గించుకున్న కాజల్‌..!

బిగ్‌బాస్‌ ప్రేక్షకులను కుక్కలు అన్న నటి

వెండితెరకు కాళోజి జీవితం

టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌

90 ఎంఎల్‌ కహానీ ఏంటి?

నేనొస్తున్నా