గోల్‌మాల్‌!

7 Feb, 2020 13:32 IST|Sakshi
దేవస్థానం డొనేషన్‌ కౌంటర్‌

శ్రీశైలం డొనేషన్‌ కౌంటర్‌లో అక్రమాలు

పోలీసుల అదుపులో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి

మరో ముగ్గురి ప్రమేయం?

విరాళ కేంద్రం అధికారులపై అనుమానాలు  

కర్నూలు, శ్రీశైలం: దేవస్థానంలోని డొనేషన్‌ కౌంటర్‌లో గోల్‌మాల్‌ జరిగినట్లు సమాచారం. దేవస్థానం అధికారుల ఫిర్యాదు మేరకు  గురువారం రాత్రి డొనేషన్‌ కౌంటర్‌లో పనిచేస్తున్న ఒక ఔట్‌సోర్సింVŠŠ  ఉద్యోగిని శ్రీశైలం వన్‌టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డొనేషన్‌ కౌంటర్‌లో పనిచేస్తున్న మరో ముగ్గురు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితో పాటుçసంబంధిత విరాళాల కేంద్రం ఉన్నతాధికారులపై కూడా పోలీసులు అనుమానాలువ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. భక్తులు వివిధ పథకాలకు అందించే విరాళాలు ఈ కేంద్రంలో సేకరిస్తారు. అయితే గత ఏడాది 2019 జూన్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు సుమారు రూ. 15 నుంచి 30 లక్షలకుపైగానే గోల్‌మాల్‌ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

పూర్తి స్థాయిలో కంప్యూటర్‌ సర్వర్, హార్డ్‌ డిస్క్‌ల నుంచి సమాచారం సేకరిస్తే అవినీతి బట్టబయలయ్యే అవకాశం ఉంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను దేవాదాయశాఖ, ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఇవ్వడానికి ఈఓ కేఎస్‌ రామారావు గురువారం విజయవాడకు వెళ్లారు. ఆయన శ్రీశైలం చేరుకున్నాక.. శుక్రవారం డొనేషన్‌ కౌంటర్‌లో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ  చేపట్టేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈఓ ఇచ్చిన ప్రాథమిక సమాచారం తోనే డొనేషన్‌కౌంటర్‌లోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని దేవస్థానం సిబ్బంది ద్వారా తెలిసింది.

మరిన్ని వార్తలు