విద్యావికాసంతోనే దేశాభివృద్ధి

16 Jul, 2017 02:49 IST|Sakshi
విద్యావికాసంతోనే దేశాభివృద్ధి
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య 
 
రాజానగరం: ఏ దేశం అభివృద్ధిని సాధించా లన్నా విద్యారంగం అభివృద్ధి చెందితేనే సాధ్యమవుతుందని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామ య్య అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని దివాన్‌చెరువులో శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌లో ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సులకు ఉపయోగపడే విధంగా గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలలో సొసైటీ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఎకడమిక్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ స్కూల్స్‌ (స్పేస్‌) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే పునశ్చరణ తరగతులను శనివారం ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటిరోజు పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

గతంలో ప్రకృతి వనరులనే సంపదగా భావించేవారని, కానీ 21వ శతాబ్దంలో మానవ వనరులనే దేశ సంపదగా భావిస్తున్నారన్నారు. ఈ కారణంగా వా రికి తగిన నైపుణ్యాలను అందించాలంటే ఉపాధ్యాయులు, ఆలోచన అనే వాటి పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయులలో యోగ్యతా ప్రమాణాల స్థాయిని పెంపొందించేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. 
 
కేవలం ఐఐటీ కోసమే కాదు..
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్పేస్‌ కార్యదర్శి కేవీ బ్రహ్మం మాట్లాడుతూ స్పేస్‌ కేవలం ఐఐటీ కోసమే కాదని, విద్యా విధానం, వ్యవస్థలలో మా ర్పు కోసం కృషి చేస్తుందని అన్నారు. గౌరవ అతిథి సీతామూర్తి మాట్లాడుతూ ‘స్వరాజ్, సత్యాగ్రహ, స్వధర్మ, సర్వోదయ, స్వదేశ్‌’ అనే పంచధర్మాలను విద్యార్థులకు అవగతం చేసి, ఆచరించేలా చూడాలన్నారు. జీవీఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ చుక్కా రామయ్య ఎంతో దార్శనికతతో 14 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ‘స్పేస్‌’ ని నేడు ప్రపంచమంతటా అనుసరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజ యప్రకాష్, తెలుగు రాష్ట్రాలలోని స్పేస్‌ స్కూల్స్‌ నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు