టీటీడీకి నేషనల్‌ ఎర్త్‌ వర్క్‌ ప్రశంసలు

25 Feb, 2020 21:04 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్లాస్టిక్‌ నిషేధంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తీసుకుంటున్న చర్యలపై ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ నేషనల్‌ ఎర్త్‌ వర్క్‌ ప్రశంసలు కురిపించింది. ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ సమన్వయ కర్త జి. అక్షయ్‌, ఏపీ టీం సభ్యులు రిఖీ, భరత్‌చంద్‌ మంగళవారం తాడేపల్లిలోని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని కలిసి ప్రశంసాప్రతాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కాగా, భక్తులు తిరుమలకు ఎక్కువ భాగం బస్సుల్లో చేరుకుంటారని దీంతో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపేట్టనున్నట్లు ఆయన తెలిపారు.

ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రభుత్వ యంత్రాంగం పటిష్టంగా అమలు చేస్తోందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల స్థానంలో ప్రత్యామ్నాయాలను చేపట్టిందని ఆయన తెలిపారు. తిరుమలతోపాటు తిరుపతిలో కూడా ప్లాస్టిక్ నిషేధం పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు టీటీడీ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణపై ఎనలేని కృషి చేస్తున్న నేషనల్ ఎర్త్ నెట్ వర్క్ టీటీడీ చర్యలను ప్రశంసించడంతో దేవస్థానం బాధ్యత మరింత పెరిగిందని సుబ్బారెడ్డి తెలిపారు.

>
మరిన్ని వార్తలు