ఢిల్లీ అల్లర్లు.. 11 మంది మృతి

25 Feb, 2020 21:55 IST|Sakshi

ఢిల్లీ: దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈశాన్య ఢిల్లీలో ఇంకా అదుపులోని రాని పరిస్థితి, ఆందోళనకారులు షాపులకు, బైక్‌లకు నిప్పు పెట్టారు. ఢిల్లీలోని మౌజ్‌పుర్‌, జఫరాబాద్‌, చాంద్‌బాగ్‌, కరవాల్‌నగర్‌లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ అందోళనల్లో 11 మంది మృతి చెందారు. దీంతో పోలీసులు యమునా విహార్‌లో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. ఆందోళనకారుల దాడిలో జర్నలిస్టులు కూడా గాయపడ్డారు. అధికారులు డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 13 కంపెనీల పారామిలటరీ దళాలను మోహరించారు. భద్రతా ఏర్పాట్లను వెయ్య మంది పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు సోషల్‌ మీడియా పుకార్లపై ప్రత్యేక మానిటరింగ్‌ చేపట్టారు. (‘పిచ్చి అల్లర్లను వెంటనే ఆపేయాలి’)

>
మరిన్ని వార్తలు