ఇల ‘వైకుంఠం’

3 Apr, 2015 01:31 IST|Sakshi
ఇల ‘వైకుంఠం’
  • ఘనంగా ఒంటిమిట్ట రామయ్య కల్యాణం
  • పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్, సీఎం
  • అపర అయోధ్య ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం గురువారం రాత్రి సాక్షాత్తూ వైకుంఠాన్ని తలపించింది. ప్రత్యేక వేదికపై రామయ్య, సీతమ్మలకు కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, సీఎం చంద్రబాబు కల్యాణానికి అతిథులుగా హాజరై ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు.
     
    కడప కల్చరల్: అపర అయోధ్య ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం గురువారం రాత్రి సాక్షాత్తూ వైకుంఠాన్ని తలపించింది. కనుల పండువగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య, సీతమ్మలను వధూవరులుగా అలంకరించి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయం పక్కనే గల మైదానంలో పందిళ్లు, కన్నుల పండువగా కళ్యాణ వేదిక ఏర్పాటు చేశారు.

    ఆలయంలో ఎదుర్కోలు వేడుకలు నిర్వహించిన అనంతరం కళ్యాణ వేదికపైకి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చారు. తిరుమల-తిరుపతి వేద పాఠశాల నుంచి వచ్చిన వేదపండితుల బృందం కళ్యాణోత్సవ ఘట్టాలను నిర్వహించింది. గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు కల్యాణోత్సవానికి అతిథులుగా హాజరై ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. టీటీడీ ఈఓ సాంబశివరావు కళ్యాణ మూర్తులకు పట్టువస్త్రాలను అందజేశారు.
     
    ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతా

    ఒంటిమిట్టను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పారు. ఒంటిమిట్టలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మా ట్లాడుతూ ఒంటిమిట్టను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తిరుపతి, కాణిపాకం, ఒంటిమిట్ట, శ్రీకాళహస్తి సర్క్యూట్‌గా ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు