తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన

21 Nov, 2019 21:03 IST|Sakshi

సాక్షి, తిరుపతి : తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6గంటలకు రావాల్సిన స్పైస్‌ జెట్‌ విమానం ఇప్పటికి రాకపోవడంతో ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రయాణికులు పడిగాపులు గాస్తు ఇబ్బందికి గురవుతున్నారు. కాగా మొత్తం 172 మంది ప్రయాణికులు స్పైస్‌ జెట్‌ విమానం రాక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే విమానం రాకపోవడానికి సాంకేతిక కారణాలే కారణం కావొచ్చని అధికారులు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు