మానవత్వం మేల్కొనేదెప్పుడు?

28 Oct, 2023 06:14 IST|Sakshi

న్యూఢిల్లీ: పాలస్తీనాలోని గాజాలో కొనసాగుతున్న రక్తపాతం, తీవ్ర హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఉల్లంఘనకు గురికాని అంతర్జాతీయ చట్టం కానీ, నిబంధన కానీ ఒక్కటీ లేదన్న విషయం ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి తేటతెల్లమవుతోందన్నారు.

‘ఎందరు చిన్నారులు ప్రాణత్యాగం చేయాలి? ఇంకెందరు మరణించాలి? మానవత్వం అనేది ఉందా? మానవత్వం మేల్కొనేది ఇంకెప్పుడు?అని ఆమె శుక్రవారం ‘ఎక్స్‌’లో ప్రశ్నించారు. గాజాలో మూడు వేల మంది అమాయక చిన్నారులు సహా మొత్తం ఏడు వేల మందికిపై ప్రాణాలు కోల్పోయినప్పటికీ రక్తపాతం, హింసకు పుల్‌స్టాప్‌ పడకపోవడంపై ప్రియాంకా గాంధీ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. 

మరిన్ని వార్తలు