ఎవరైతే మూటలు మోసారో వారికే...

28 Mar, 2015 12:50 IST|Sakshi
ఎవరైతే మూటలు మోసారో వారికే...

విశాఖ : ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని పీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మార్చి 31న టీడీపీ ప్రజావంచన దినం నిర్వహిస్తామని ఆయన శనివారమిక్కడ తెలిపారు. అన్ని డివిజన్ కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బొత్స వెల్లడించారు.  కేంద్రంతో టీడీపీ స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ వ్యాపార రాజకీయాలు చేస్తోందని బొత్స విమర్శించారు. ఎన్నికల్లో ఎవరైతే మూటలు మోసారో వారి ప్రయోజనాల కోసమే పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మాణమని బొత్స ఆరోపించారు.

పట్టిసీమ వల్ల పోలవరం ప్రాజెక్ట్ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మాజీమంత్రి వట్టి వసంత్ కుమార్ అన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ ప్రతిపాదన వచ్చిన నాటి నుంచి రైతులలో ఆందోళన నెలకొందని తెలిపారు. ఏప్రిల్ 8న విశాఖలో మేధావులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు వట్టి వసంత్ కుమార్ చెప్పారు.  పోలవరం లెప్ట్ కెనాల్ కోసం మాట్లాడకపోవటం దురదృష్టకరమన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తావించాకే కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి అన్నారు. హిందుస్తాన్ షిప్యార్డ్ను కేంద్రం ఆదుకోవాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు