పింఛన్లపై హైకోర్టు తాఖీదు

29 Dec, 2014 00:44 IST|Sakshi
పింఛన్లపై హైకోర్టు తాఖీదు

 కోటబొమ్మాళి: మండలంలోని జర్జంగి పంచాయతీలో ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సర్వేలో తమ పింఛన్లును అధికారులు తొలగించారంటూ పలువురు హైకోర్టులో పిటీషన్ వేయగా  విచారణకు స్వీకరించింది. కోర్టు జనవరి 19న స్వయం గా గాని, వారి తరఫున న్యాయవాది గాని కోర్టుకు హాజరుకావాలని రాష్ట్ర పం చాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌కు, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్‌కు, కోటబొమ్మాళి ఎంపీడీఓ, జర్జంగి సర్పంచ్‌కు కోర్టు తాఖీదులు ఇచ్చింది. జర్జంగిలోని గుంజిలోవకు చెందిన కవిటి మల్లయ్యతో పాటు మరో 10 మంది పింఛనుదారులు తామంతా అర్హులమైనా తమ అధికారులు పింఛన్లు తొలగించారని హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు హాజరుకమ్మని ఆదేశించింది.
 

మరిన్ని వార్తలు