కష్టాలు వింటూ.. కన్నీరు తుడుస్తూ

24 Sep, 2018 06:45 IST|Sakshi
పెద్దమ్మకు ఆత్మీయంగా వాగ్దానం

జిల్లావ్యాప్తంగా ప్రతిపక్షనేత ఎదుట కష్టాలు చెప్పుకున్న ప్రజానీకం

ప్రతి సమస్యపై స్పందించిన జననేత

అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని మాటిచ్చిన జగన్‌

విశాఖపట్నం, పెందుర్తి : ‘అన్నా పన్నులు వసూలుకే మున్సిపాలిటీ .. అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉండిపోయాం’ నర్సీపట్నం వాసుల ఆవేదన..‘అన్నా తాండవ షుగర్‌ ఫ్యాక్టరీని నష్టాల్లో ముంచేసి మా కడుపులు కొట్టారన్నా..మా నియోజకవర్గంలో ఎక్కడా టీడీపీ నాయకులు ప్రభుత్వ భూములు వదలడం లేదన్నా’ పాయకరావుపేట నియోజకవర్గం ప్రజానీకం ఫిర్యాదులు..‘అన్నా అందమైన లక్క బొమ్మలు మా చేతుల్లో ప్రాణం పోసుకుంటున్నాయి..కానీ మేమే జీవచ్చవల్లా బతుకుతున్నాం..ఈ ప్రభుత్వానికి మా గోడు వినడపడలేదన్నా’ యలమంచలి నియోజకవర్గ వాసుల ఆక్రందన..‘అన్నా చంద్రబాబు హయంలో సుగర్‌ ఫ్యాక్టరీలను నిర్వీర్యం చేశారు..వేలాది మంది చెరకు రైతుల పొట్ట కొట్టారన్నా..మా భవిష్యత్‌ ఏంటన్నా’ అనకాపల్లి వాసుల ఆందోళన..‘అన్నా మా నియోజకవర్గంలో అభివృద్ధి్ద అనే మాటే లేదన్నా.

ఊళ్లను కలుపుతున్న రోడ్లు అధ్వానంగా మారాయి..టీడీపీ సర్కారు గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని ముంచేసింది అన్నా’ ఇదీ చోడవరం వాసుల బాధ..‘అన్నా రైవాడ నీటిని నగరానికి తరలించడంతో మాకు సాగుకు నీరందడం లేదన్నా..ప్రత్యామ్నాయం ఏదైనా చూపి మాకు న్యాయం చేయండన్నా’ మాడుగుల నియోజకవర్గ రైతాంగం వినతి..‘సింహాచలం దేవస్థానం భూ సమస్యతో వేలాది మంది సతమతమవుతున్నారు..ఫార్మా, ఎన్టీపీసీ కాలుష్యంతో చావుకు దగ్గరవుతున్నాం..మా గోడు ఎవరికి చెప్పుకోవాలన్నా.మీరోస్తే మా కష్టాలు పోతాయన్నా’ పెందుర్తి వాసుల ధీమా..‘అన్నా నగరంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికారం కోసం, భూ అక్రమణలకు, సెటిల్‌మెంట్‌లకే తప్ప అభివృద్ధి చేయడం లేదన్నా..వేలాది మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరంగా ఉంటున్నారు..ఐటీ కంపెనీలు వచ్చాయి అంటారు అవెక్కడో మాకు ఇంత వరకు కనపడలేదన్నా’ విశాఖ నగర వాసుల íఫిర్యాదులు..‘అన్నా మా నియోజకవర్గంలో కంచె చేను మేసిన చందంగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రే భూములను దోచుకుంటున్నారన్నా..ఉద్యాన పంటల రైతులు నష్టాల్లో ఉన్నారన్నా’ అంటూ భీమిలివాసుల ఆవేదన.

ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో అడుగుపెట్టిన నాటి నుంచి లక్షలాదిమంది ప్రజానీకం అనేక కష్టాలు చెప్పుకున్నారు. టీడీపీ ప్రభుత్వం పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను చెప్పుకుని కన్నీరు పెట్టుకున్నారు. అధికారపార్టీ నాయకులు తమ ప్రాంతాల్లో ఎలా దోచుకుతింటున్నారో వివరించారు. మీరు అధికారంలోకి వస్తేనే తమ కష్టాలు తీరుతాయని..మీ వెంట మేమంతా ఉన్నామంటూ జిల్లా, నగర వాసులు జననేతపై తమకున్న అపార నమ్మకాన్ని వెలిబుచ్చారు. తన వద్దకు వచ్చి కష్టం చెప్పుకున్న ప్రతీ ఒక్కరితో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యను తీక్షణంగా వింటూ వారి కన్నీరు తుడుస్తూ..భరోసానిస్తూ ముందుకు సాగారు.

మరిన్ని వార్తలు