భక్తులతో కిటకిటలాడిన శ్రీశైలం

4 Nov, 2019 08:03 IST|Sakshi

కర్నూలు, శ్రీశైలం ప్రాజెక్ట్‌: కార్తీకమాసం మొదటి ఆదివారం సందర్భంగా  శ్రీశైలం  భక్తులతో కిటకిటలాడింది. సుమారు 60 వేలమంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఉంటారని ఆలయాధికారుల అంచనా. తెల్లవారుజామున పవిత్ర పాతాళ గంగలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వేకువ జామున 3.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి  సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజలు, మహామంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. 4.30 గంటల నుంచి భక్తులను స్వామి అమ్మవార్ల సర్వ దర్శనం, ఆర్జిత సేవలకు అనుమతించారు.

పాతాళగంగలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు
రద్దీ కారణంగా సుప్రభాత సేవ, మహా మంగళ హారతి సేవ, టిక్కెట్లను నిలిపివేశారు. భక్తులకు క్యూలలో మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం, ఉదయం వేళల్లో పాలు పంపిణీ చేశారు.  శివదీక్షా శిబిరాల్లో వనభోజనాలు ఏర్పాటు చేశారు. అన్నదాన మందిరంలో భక్తుల సౌకర్యార్థం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. కార్తీక దీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట, గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీకదీపారాధన చేసుకునే భక్తులకు ఆలయ ఉత్తరభాగం నుంచి ప్రత్యేక ప్రవేశం కల్పించారు.

మరిన్ని వార్తలు