ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోతే.. అనుమతి రద్దు

23 Oct, 2013 03:20 IST|Sakshi

ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని అధికారులను కలెక్టర్ శ్రీని వాస శ్రీనరేష్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై ఆయన మంగళవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
 కలెక్టర్ మాట్లాడుతూ... ఇళ్ల నిర్మాణం చేపట్టని లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇచ్చిన అనుమతిని రద్దు చేసేందుకు చర్యలు చేపట్టాలని, వారి స్థానంలో ఇతరులకు అవకాశమివ్వాలని ఆదేశించారు. నిర్మా ణం పూర్తిచేసిన లబ్ధిదారులకు వెంటనే బిల్లు లు చెల్లించాలన్నారు. ఆన్‌లైన్ నమోదులో తప్పులు దొర్లడంతో అనేకమంది లబ్ధిదారులు ప్రభుత్వ ఆర్ధిక సహాయం పొందలేకపోతున్నారని చెప్పారు. పినపాక, దమ్మపేట, పెనుబల్లి మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందన్నారు. దీనిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు.. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాలను సకాలంలో పూర్తిచేసి, జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిపేందుకు హౌజింగ్, డ్వామా, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. జిల్లాలో చాలామంది పేదలు ఇంటి నిర్మాణ మంజూరు ఉత్తర్వులు రాకుండానే నిర్మాణలు చేపట్టారని, వీటికి బిల్లులు చెల్లించాలని ‘గ్రీవెన్స్ డే’లో అర్జీలు ఇస్తున్నారని చెప్పారు. ఈ అర్జీలను పరిశీ లించి, పేపర్ వర్క్ పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని చెప్పారు. వీరికి ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే వీరికి ఆర్ధిక సహాయం అందించవచ్చని అన్నారు.
 
 ఇక నుంచి నూతన గృహాలను మంజూరు చేసే సమయంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి హౌజింగ్ అధికారులదే బాధ్యతని అన్నారు. నిర్మల్ భారత్ అభియాన్ కింద ఇప్పటివరకు 20వేల వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తయ్యాయని చెప్పారు. మి గతా వాటిని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇళ్లు, మరుగుదొడ్ల ని ర్మాణానికి అవసరమైన ఇసుకను తరలిం చేందుకు పోలీసులు అభ్యంతరం చెబుతున్నారని, జరిమానా విధిస్తున్నారని ఈజీఎస్, ఆర్‌డబ్ల్యూఎస్, హౌజింగ్ అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని డీఈలు, ఏఈలు, ఆర్డీవోలు, తహశీల్దారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కలెక్టర్ సూచిం చారు. ఈ సమావేశంలో హౌజింగ్ పీడీ వైద్యం భాస్కర్, డ్వామా పీడీ శ్రీనివాసులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మల్లేశం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు