అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

18 Jan, 2014 03:50 IST|Sakshi

 సీటీఆర్‌ఐ (రాజమండ్రి), న్యూస్‌లైన్ : స్థానిక పేపరుమిల్లు సమీపంలోని ఆనంద్‌నగర్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అతడి భార్య నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి విషయం తెలపడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. సింహాద్రి నగర్‌కు చెందిన వరప్రసాద్ (30)కు గాదిరెడ్డి నగర్‌కు చెందిన వరలక్ష్మితో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలం తర్వాత వరప్రసాద్ అప్పులు చేసి ఆటోలు కొనడం, వాటిని తిరిగి అమ్మేసి ఖాళీగా తిరగడం చేసేవాడు.

ఇదిలావుండగా అతడి భార్య వరలక్ష్మి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుం డడంతో తరచూ ఘర్షణ పడేవారు. 2012 ఆగస్టులో వారిద్దరూ ఓ అంగీ కారానికి వచ్చి వేర్వేరుగా జీవిస్తున్నారు. వరలక్ష్మి ఇద్దరు పిల్లలతో కలసి మరో వ్యక్తితో జీవిస్తుండగా, వరప్రసాద్ తన అక్క వద్ద ఉంటున్నాడు. గురువారం వరప్రసాద్, వరలక్ష్మిల పుట్టినరోజు కావడంతో అతడు ఆనందనగర్‌లో నివసిస్తున్న భార్య వద్దకు వచ్చి.. ‘ఇకపై ఇద్దరం కలసి జీవిద్దామ’ని చెప్పాడు. అంగీకరించిన వరలక్ష్మి ఆ రోజు సాయంత్రం గాదాలమ్మ నగర్‌లోని పుట్టింటికి వెళ్లింది.

అతడు వరలక్ష్మి ఇంట్లోనే ఉండిపోయాడు. శుక్రవారం ఉదయం కుమారుడు సిద్ధును భర్త వద్దకు పంపించింది. కుమారుడితో ‘నీవు అమ్మను తీసుకురా’ అని చెప్పి వరప్రసాద్ పంపించేశాడు. ఉదయం 9.30 గంటల సమయంలో వచ్చి చూసేసరికి తలుపులు వేసి ఉన్నాయని, లోనికి వెళ్లి చూడగా తన భర్త ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడని ఆమె పోలీసులకు వివరించింది. సీఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

 అనుమానాలెన్నో
 వరప్రసాద్ మృతిపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను వరలక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి సమయంలో ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి కూడా ఇంటికి వచ్చినట్టు సమాచారం. వీరి మధ్య ఏమైనా తగా దా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

 ఫ్యానుకు ఉరి వేసుకున్న వ్యక్తిని చూసిన వెంటనే చీరను కత్తి పీటతో కోసేశానని చెబుతున్న వరలక్ష్మి మాటలు ఎంతమేర నిజమో నిర్ధారించాల్సి ఉంది. ఆ ఇంటికి దూరంగా ఎందుకు పడవేయాల్సి వచ్చిందనే ప్రశ్న తలెత్తుతు తోంది. వరలక్ష్మి ఉదయం భర్త ఇంటి ముందు ముగ్గు వేసి, తాపీగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి పోలీసులకు తెలిపినట్టు స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు