జూలై 1న తిరుమలకు రాష్ట్రపతి

29 Jun, 2015 07:52 IST|Sakshi

తిరుమల, తిరుచానూరు: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 1న తిరుమలకు రానున్న నేపథ్యంలో అధికారులు తిరుమల, తిరుపతి, తిరుచానూరు, కపిల తీర్థం తదితర ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం చిత్తూరు  జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, అర్బన్ ఎస్పీ గోపినాథ్‌జెట్టి, టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తదితరులతో కూడిన అధికారుల బృందం రేణిగుంట, తిరుచానూరు, కపిల తీర్థం, తిరుపతి, తిరుమలలోని పలు ప్రాంతాలను పరిశీలించనున్నారు. కాగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 1న ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటల సమయంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని.. నేరుగా తిరుచానూరు చేరుకుంటారు. పద్మావతీ అమ్మవారిని, తర్వాత కలిలేశ్వరున్ని దర్శించుకున్న అనంతరం తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకు బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని తిరుగు ప్రయాణమవుతారు.

తిరుమలలో భక్తుల రద్దీ
ఏడుకొండలవాడిని దర్శిచడానికి భక్తులు పోటెత్తారు. దీంతో క్యూలైన్లు కిక్కిరుస్తున్నాయి. ప్రస్తుతం స్వామివారిని దర్శించుకోవడానికి 28 కంపార్టమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడక దర్శనానికి 4గంటలు, సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

మరిన్ని వార్తలు