ప్రొఫెసర్ లక్ష్మికి చుక్కెదురు

9 Nov, 2016 17:43 IST|Sakshi
ప్రొఫెసర్ లక్ష్మికి చుక్కెదురు

గుంటూరు: మెడికో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రొఫెసర్ లక్ష్మికి కోర్టులో చుక్కెదురైంది. ఆమె బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. గత నెల 24న మెడికో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో ప్రొఫెసర్ లక్ష్మీ నిందితురాలు. దీంతో ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించగా కోర్టు అందుకు నిరాకరించింది. జీజీహెచ్ ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు తాళలేక పీజీ విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మి 12 రోజులుగా పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉంది. అయితే ముందస్తు బెయిల్ కోసం గుంటూరు జిల్లా కోర్టులో ఆమె తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌ను కోర్టు తొలుత ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. పోలీసులు కేసు డైరీ కోర్టుకు పంపకపోవడంతో బెయిల్‌పై విచారణను వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చారు. అప్పటివరకు ప్రొఫెసర్ లక్ష్మికి తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటూ ఆమె తరఫు న్యాయవాది కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల వల్లే సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడిందని విచారణ కమిటీ పేర్కొన్న విషయం తెలిసిందే.