ఆ రచ్చ మనవాడిదే!

25 Oct, 2017 10:32 IST|Sakshi

శ్రీకాకుళం రూరల్‌: రామ్‌ చరణ్‌ రచ్చ సినిమాలో ‘మస్తే’ ‘మస్తే’ అంటూ ఓ రకమైన మాడ్యులేషన్‌తో డైలాగ్‌ చెప్పిన బుడతడు అందరినీ గుర్తుండే ఉంటాడు కదా. ఈ బుడతడు సిక్కోలు వాసే. శ్రీకాకుళంలో మంచి పేరున్న ప్రభాకర్‌ సిద్ధాంతి మనవడే ఈ ప్రేమ్‌బాబు. రచ్చ సినిమా నుంచి మొదలైన ప్రేమ్‌బాబు ప్ర స్థానం బాలల చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించే వరకు ఎ దిగింది. ఇటీవల జిల్లా పరిషత్‌లోని కాకివీధిలో తన పెదనాన్న విభూతి సూరిబాబు ఇంటికి తన తల్లిదండ్రులతో కలిసి ప్రేమ్‌బాబు వచ్చాడు.  

ప్రస్తుతం ప్రేమ్‌ ఏడో తరగతి చదువుతున్నాడు. ఓ వైపు స్టూడెంట్‌గా, మరోవైపు యాక్టర్‌గా రెండు పడవల ప్రయా ణం ఎంచక్కా చేస్తున్నాడీ కుర్రాడు. యాక్టింగ్‌లో ఎలాంటి శిక్షణ లేకపోయినా సినిమాల్లోని ఏదైనా డైలాగ్‌ చెప్పాలంటే సింగిల్‌ టేక్‌లోనే ఓకే చేసేస్తున్నాడు. ఓ ఫంక్షన్‌లో ప్రేమ్‌బాబును చూసిన దర్శకుడు సంపత్‌నంది తొలిసారిగా ‘రచ్చ’లోని చిన్నప్పటి రామ్‌చరణ్‌ క్యారెక్టర్‌ ఇచ్చాడు. ఆ చిత్రం లోని ఓ రిస్కీ సన్నివేశంలో ప్రేమ్‌ అదరగొట్టేశాడు. డైలాగులు కూడా బాగా చెప్పడంతో అప్పటి నుంచి సినీ అవకాశాలు వెల్లువెత్తాయి. పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో చిన్నప్పటి ఎన్టీఆర్‌గా ‘టెంపర్‌’లో నటించాడు. రోగ్‌ చిత్రంలోనూ బాల నటుడిగా కనిపిం చాడు. శ్రీనువైట్ల డైరెక్షన్‌లో మిస్టర్‌ చిత్రంలోనూ మెరిశాడు. ఓ వైపు పెద్ద చిత్రాలు చేస్తూనే మరో వైపు బాలల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. మన్మోహన్‌ డైరెక్షన్‌లో ‘బుడు గు’, బీమనేని సుధాకర్‌ డైరెక్షన్‌లో ‘ఆదిత్య’ చిత్రాల్లో తన ప్రతిభను చూపించాడు.

ప్రశంసలు..
ప్రేమ్‌బాబు నటించిన చిత్రాలకు గాను అమెరి కాలోని ఏంజెల్స్‌లో ఓ సంస్థ ప్రత్యేకంగా సన్మానించింది. ఆదిత్య చిత్రానికి గాను చైనాలో జ్యూరీ అవార్డుతో పాటు రచ్చ చిత్రంలో నట నకు ‘టైమ్స్‌ఆఫ్‌ ఇండియా’ అవార్డులను కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా గవర్నర్‌ నరసింహన్, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌లు ప్రేమ్‌ను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సన్మానించారు. టెంపర్‌ చిత్రంలో ప్రేమ్‌బాబు నటన చూసిన పూరీ జగన్నాథ్‌ ‘పులిబిడ్డను కన్నావు’ అంటూ ఇచ్చిన కితాబుతో చాలా ఆనందపడ్డానని తండ్రి రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు