300 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం

14 Dec, 2013 03:47 IST|Sakshi

 తడ, న్యూస్‌లైన్ : ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న 300 బస్తాల రేషన్ బియ్యాన్ని గురువారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. పోలీసుల కథనం మేరకు..రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నాయనే సమాచారం తడ ఎస్సై ఎం.నాగేశ్వరరావు తన సిబ్బందితో గురువారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. చేనిగుంట వద్ద ఓ లారీని ఆపగా డ్రైవర్ దూకి పరారయ్యాడు. లారీలోని సరుకును పో లీసులు పరిశీలిస్తుండగా నలుగురు వ్యక్తులు కారులో వచ్చి ఆరా తీయసాగారు. వారిని లా రీకి పెలైట్లుగా అనుమానించిన పోలీసులు వెం టనే వాహనాలతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. లారీలోని 300 బస్తాల రే షన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పో లీసుల అదుపులో ఉన్న కారుడ్రైవర్ సూళ్లూరుపేటకు చెందిన వ్యక్తికాగా, మిగిలిన వారు వా టంబేడుకు చెందిన వారు. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ గోదాముకు తరలించారు.
 
 శ్రీకాళహస్తి కేంద్రంగా స్మగ్లింగ్
 చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి కేంద్రంగా కొం దరు ఆంధ్రా రేషన్ బియ్యాన్ని తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తడ మండలానికి చెందిన పలువురు రేషన్ డీలర్లు బియ్యం స్మగ్లర్లతో నేరుగా మంతనాలు సాగి స్తూ, గుట్టుచప్పుడు కాకుండా అక్రమ వ్యా పా రం చేస్తున్నట్లు సమాచారం. వరదయ్యపాళెం మండలంలోనూ బియ్యం సేకరణ, తరలింపు భారీస్థాయిలోనే జరుగుతోంది. ఇటీవల విజిలె న్స్ అధికారులు దాడులు జరిపి వరదయ్యపాళెం మండలంలో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.  ఈ క్రమంలో గురువారం రా త్రి దొరికిన వ్యక్తులు తెలిపిన సమాచారం ప్ర కారం బియ్యాన్ని చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడుకు తరలించేందుకు ప్రయత్నించగా, చెక్‌పోస్టు వద్ద నిఘా ఉన్నట్టు సమాచారం రావడంతో దారి మళ్లించి చిక్కినట్టు తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు