సత్యం పలికేందుకు చదవాలి: గద్దర్

15 Nov, 2014 03:20 IST|Sakshi
సత్యం పలికేందుకు చదవాలి: గద్దర్

కావలి: సత్యం పలికేందుకే ప్రతి ఒక్కరు చదవాలని ప్రజాగాయకుడు గద్దర్ పిలుపునిచ్చారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని విశ్వోదయ విద్యాసంస్థల వ్యవస్థాపకదినం సందర్భంగా శుక్రవారం రాత్రి గద్దర్‌కు ఆ సంస్థ నిర్వాహకులు విశ్వోదయ గౌరవ జీవితకాల సభ్యత్వాన్ని ప్రదానం చేశారు. విశ్వోదయ విద్యాసంస్థల ఆవరణలో స్వాతంత్య్ర సమరయోధుడు, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన జానపద కళాకారుడు కర్నాటి లక్ష్మీనరసయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గద్దర్ మాట్లాడుతూ దేశంలో కులవ్యవస్థను సమూలంగా నాశనం చేసేందుకు విద్యార్థులు నడుం కట్టాలని కోరారు.  ఈసందర్భంగా సమాజంలో అసమానతలు, ప్రపంచబ్యాంకు ప్రవేశంతో కలిగే నష్టాలు, సామ్రాజ్యవాదం వల్ల కలిగే చెడుపై అందరిలో ఆలోచన రేకెత్తించేలా పాటలు పాడారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సంఘసేవకుడు వేదకుమార్ మాట్లాడుతూ విశ్వోదయ లాంటి విద్యాసంస్థల్లో విద్యార్థులు ప్రకృతి ఒడిలో పాఠాలను నేర్చుకుంటున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు