నేటి నుంచి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె

17 Jan, 2015 02:39 IST|Sakshi

రాజమండ్రి సిటీ : యానమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, శ్రమదోపిడీ అరికట్టేందుకు శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ ఎంప్లాయూస్ యూనియన్ తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా కార్యదర్శి పి.సత్యానందం పిలుపు నిచ్చారు. అక్రమ సస్పెన్సన్స్, శిక్ష రద్దు చేయాలని, డ్రైవర్‌తో బలవంతంగా టిమ్ (కండ క్టర్) డ్యూటీలు చేయించరాదని, డబుల్ డ్యూటీకీ డబుల్ జీతం ఇవ్వాలి, గ్యారేజీ కార్మికుల రిక్వస్ట్ ట్రాన్స్‌ఫర్స్ క్లియర్ చేయాలని, జిల్లా వ్యాప్తంగా ఇంకా మిగిలిన డబుల్ డోర్ బస్సులను సింగిల్ డోర్ చేయాలనే డిమాండ్లతో సమ్మె చేపడుతున్నట్టు సత్యానందం పేర్కొన్నారు.
 
 యాజమాన్యం, కార్మిక  శాఖ లతో పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో సమ్మె చేయాల్చిన పరిస్థితి నెలకొందన్నారు. జిల్లా వ్యాప్తంగా9 డిపోల్లోని యూనియన్ సభ్యులంతా  తెల్లవారు జాము నుంచి సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం : ఎంప్లాయూస్ యూనియన్ నాయకులతో చర్చలు జరుపుతున్నాం, సఫలం కావచ్చని ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ వరప్రసాద్ అన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుల సమ్మెకు దిగినా జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేస్తామని వివరించారు.
 

మరిన్ని వార్తలు