ఈనాటి ముఖ్యాంశాలు

10 Jul, 2019 19:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పెట్రోలియం ఉత్పాదనలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర పెట్రోలియ శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అన్నం సతీష్‌ ప్రభాకర్‌.. ఆ మరుక్షణనే నారా లోకేష్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమికి లోకేష్‌ వ్యవహారమే కారణమని మండిపడ్డారు. కర్ణాటకలో హైడ్రామా కొనసాగుతోంది. మరో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బుధవారం సాయంత్రం రాజీనామా చేశారు. కర్ణాటకలో పాలక జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినందున అవసరమైన చర్యలు చేపట్టాలని స్పీకర్‌ను ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్‌ను బీజేపీ కర్ణాటక చీఫ్‌ బీఎస్‌ యడ్యూరప్ప కోరారు.

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

మరిన్ని వార్తలు