సమైక్య తీర్మానం సాధ్యం కాదు: చీఫ్‌ విప్ గండ్ర

17 Dec, 2013 17:32 IST|Sakshi
సమైక్య తీర్మానం సాధ్యం కాదు: చీఫ్‌ విప్ గండ్ర

హైదరాబాద్:రాష్ట్ర విభజన బిల్లుపై రేపట్నుంచి అసెంబ్లీలో చర్చిస్తామని చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి తెలిపారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు శుక్రవారం వరకూ సభ కొనసాగుతోందన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్సార్ సీపీ చేస్తున్న సమైక్య తీర్మానం డిమాండ్ సాధ్యం కాదన్నారు. అసెంబ్లీ  మాత్రం శుక్రవారం వరకూ జరుగుతుందని, మధ్యలో కొన్ని సెలవులుంటాయన్నారు. కాగా అసెంబ్లీ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందనేది స్పీకర్ ప్రకటిస్తారని తెలిపారు.

 

సభలో టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దు కృష్ణమనాయుడు చేసిన వ్యాఖ్యలకు స్పీకర్ ఆవేదన చెందారన్నారు. తక్షణమే ఆయన స్పీకర్ కు క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు