ఏపీలో ఎన్నికల కోడ్‌ ఎత్తివేత

18 Mar, 2020 18:43 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తొలగించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాజకీయ పార్టీలు, నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థులు ఎవరూ ఎన్నికల ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషనర్‌ నిర్ణయంలో రాజకీయ కోణాలు ఉన్నాయంటూ ప్రభుత్వం తరఫున అడిషనల్‌ సొలిటర్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఒకవైపు ఎన్నికల ప్రక్రియను నిరంతరాయంగా వాయిదా వేస్తూ.. మరోవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కొనసాగిస్తున్నారంటూ కోర్టులో వాదనలు వినిపించారు. 

దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఆక్షేపించింది. తదుపరి స్థానిక ఎన్నికల తేదీలు ఖరారు చేసేటప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేసింది. 

చదవండి : ఏపీలో ఎన్నికల వాయిదా: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

మరిన్ని వార్తలు