సత్యేందర్‌ జైన్‌ బెయిల్‌ గడువు మళ్లీ పొడిగింపు

25 Nov, 2023 06:29 IST|Sakshi

న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్‌ ఆరోపణలెదుర్కొంటున్న ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ మధ్యంతర బెయిల్‌ గడువును సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. బెయిల్‌ గడువు శుక్రవారంతో ముగియడంతో జస్టిస్‌ ఏఎస్‌ బొపన్న సారథ్యంలోని ధర్మాసనం విచారించాల్సి ఉంది.

ఆయన అందుబాటులో లేకపోవడంతో జస్టిస్‌ బేలా ఎం. త్రివేది బెయిల్‌ గడువును డిసెంబర్‌ 4వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. జైన్‌ పెట్టుకున్న రెగ్యులర్‌ బెయిల్‌ దరఖాస్తుపై విచారణ కూడా అదే రోజున ఉంటుందని స్పష్టం చేశారు. మనీ ల్యాండరింగ్‌ ఆరోపణలపై గత ఏడాది మేలో జైన్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు