సౌత్‌ సెంట్రల్‌ రైల్వేను తాకిన సమైక్య సెగ

7 Oct, 2013 02:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సమైక్యాంధ్ర ఉద్యమ సెగ రైల్వే వ్యవస్థను తాకింది. గ్రిడ్‌ నుంచి రైల్వే లైన్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో విజయవాడ, గుంతకల్‌ తదితర డివిజన్లలో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. ఆదివారం తెల్లవారుజామున 5.30 నుంచి 6.30 గంటల మధ్య రైళ్లు ఒక్కటి కూడా కదలలేదు. ఇప్పటికే బస్సులు లేకపోవడంతో రైళ్లపైనే ఆధారపడుతున్న ప్రయాణికులు, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మూడు రోజులుగా రైళ్లలో అంతరాయం కలుగుతూ వస్తు న్న పెద్దగా ఇబ్బంది కలగలేదు. కానీ ఆదివారం విజయవాడ, తిరుపతి, రేణిగుంట, అనంతపురం, ధర్మవరం, గూడూరు, నెల్లూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఎక్కడి రైళ్లు అక్కడ నిలిచిపోవడంతో ప్రజా రవాణా వ్యవస్త స్తంభించింది.

 

విజ యవాడ నుంచి వెళ్లే పినాకినీ ఎక్‌‌సప్రెస్‌ను డీజిల్‌ ఇంజన్‌తో రెండు గంటలు ఆలస్యంగా నడిపారు. సోమవారం చెనై్న నుంచి రావాల్సిన పినాకినీ ఎక్‌‌సప్రెస్‌, విజయవాడ నుంచి వెళ్లాల్సిన జనశతాబ్ది ఎక్‌‌సప్రెస్‌లను రద్దు చేశారు. డివిజన్‌లో 120 విద్యు త్‌ ఇంజన్లు ఉండగా, డీజిల్‌ ఇంజన్లు 12 మాత్రమే ఉన్నాయి. దీనివల్ల అన్ని ఎక్‌‌సప్రెస్‌ రైళ్లకు డీజిల్‌ ఇంజన్లు ఏర్పాటు చేయడం కూడా కష్టమని రైల్వే అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుండడంతో సోమవారం దీని ప్రభావం మరింతపడే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, చెనై్న నుంచి పది డీజిల్‌ ఇంజన్లను రప్పించి నెల్లూరు జిల్లా పడుగుపాడు లూప్‌లైన్లో ఉంచారు.


ఆదివారం రద్దయిన ప్యాసింజర్‌ రైళ్లు: ఒంగోలు-తెనాలి, తెనాలి-గుంటూరు, ఒంగోలు-విజయవాడ, ఒంగోలు-గూడూరు, తిరుపతి- గూడూరు, తెనాలి-ఒంగోలు, విజయవాడ-గుంటూరు, డోర్నకల్‌-విజయవాడ, ఖాజిపేట-విజయవాడ, గూడూరు-తిరుపతి ఉన్నాయి. సోమవారం కూడా రద్దయిన రైళ్లు: విద్యుత్‌ అంతరాయం వల్ల ఆదివారంతో పాటు ముందుజాగ్రత్త చర్యగా సోమవారం కూడా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ‘చెనై్న-విజయవాడ, పినాకిని ఎక్‌‌సప్రెస్‌: చెనై్న- విజయవాడ, శతాబ్ది ఎక్‌‌సప్రెస్‌: విజయవాడ-బిట్రగుంట, బిట్రగుంట-చె నై్న, చెనై్న-గూడూరు, విజ యవాడ-యశ్వంత్‌పూర్‌, యశ్వంత్‌పూరు-విజయవాడ(8వతేదీ), గుంటూరు-కాచిగూడ, నర్సాపూర్‌-తిరుపతి, తిరుపతి- మచిలీపట్నం’ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది.


హెల్‌‌పలైన్లు..


 రైళ్ల సమాచారం తెలుసుకోవడానికి విజయవాడ డివిజన్‌ పరిధిలోని కొన్ని రైల్వేస్టే„షన్లలో హెల్‌‌పలైన్‌ సెంటర్లను ప్రారంభించినట్లు రైల్వే ముఖ్య పౌర సంబంధాల అధికారి ఎఫ్‌.ఆర్‌.మైకేల్‌ తెలిపారు.

        విజయవాడ:0866-2576796, 0866-2575038, 9701373073
        నెల్లూరు:0861-234866, 2345864
        ఒంగోలు:08592-280202, 280203
        


రాజమండ్రి:0883-2420541, 24205543 200 నుంచి 250 మెగావాట్లు అవసరం...


 విజయవాడ డివిజన్‌లో ఉన్న విద్యుత్‌ రైళ్లు నడవాలంటే రోజుకు 200 నుంచి 250 మెగావాట్ల విద్యుత్‌ అవసరమవుతుంది. వివిధ గ్రిడ్ల నుంచి దీనిని తీసుకుని సబ్‌స్టే„షన్ల ద్వారా సరఫరా చేస్తారు. ఈ విధంగా విజయవాడ రైల్వే డివిజన్‌లో మొత్తం 14 సబ్‌స్టే„షన్లు ఉన్నాయి. విద్యుత్తు సరఫరాలో అంతరాయం వల్ల విజయవాడ-నాయుడుపేట వరకు ఉన్న సబ్‌స్టే„షన్లపై తీవ్ర ప్రభావం పడింది. విజయవాడ నుంచి రోజూ 60 గూడ్‌‌స రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. రైల్వేకు ఒక గూడ్సు ద్వారా 30 లక్షల రూపాయల ఆదాయం లభిస్తుంది. రైల్వే ఉన్నతాధికారులు ఉదయం నుంచి డివిజనల్‌ కార్యాలయంలో విద్యుత్తు, జోనల్‌ స్థాయి అధికారులతో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు