అందుకే అప్పు పుట్టట్లేదు: చంద్రబాబు

25 Feb, 2015 18:22 IST|Sakshi

పునర్వ్యవస్థీకరణ బిల్లు ద్వారా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలను కేంద్రం ఆదుకోవట్లేదని, కనీసం ఆ దిశగా ప్రయత్నాలుకూడా చేయట్లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కారణం వల్ల కొత్తగా అప్పులు చేసే వెసులుబాటుకూడా లేకుండాపోయిందని పేర్కొన్నారు.

బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆయన.. ఈ ఏడాది జులై కల్లా పుంగనూరుకు, వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా కుప్పంకు హంద్రీ-నీవా నీటిని అందిస్తామన్నారు. 55 వేల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పిస్తామని, వ్రీకేఆర్ రుణాలను పూర్తిగా మాఫీచేస్తామని తెలిపారు. సబ్సిడీ ద్వారా ఒక టన్ను పశువుల దాణాను రూ.3వేలకే అందిస్తామన్నారు.

మరిన్ని వార్తలు