శ్రీవారి దర్శనం: వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక​ టోకెన్లు

5 Feb, 2019 11:56 IST|Sakshi

సాక్షి, తిరుమల:  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం 65 ఏళ్లకుపైబడిన వృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ నాలుగు వేల టోకెన్లను జారీ చేసింది. శ్రీవారి దర్శనం కోసం మంగళవారం
ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెట్లు, మధ్యాహ్నం 2 గంటలకు రెండువేల టోకెన్లు, మూడు గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు ఇవ్వనుంది.

రద్దీరోజుల్లో తిరుమలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా.. ఈ అవకాశాన్ని కల్పించినట్టు టీటీడీ తెలిపింది. బుధవారం ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని, ఇందుకోసం నాలుగు వేల టోకెన్లు ఇస్తామని టీటీడీ వెల్లడించింది. తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ప్రిన్స్‌పాల్‌ సెక్రటరీ శైలేంద్ర జోషి, ట్యాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, కర్నాటక డీజీపీ నీలమణిరాజు, తమిళనాడు డీజీపీ రాజేంద్రన్ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు.

మరిన్ని వార్తలు